ఆంధ్ర రాష్త్రంలొని చాలా మందికి ఆచార్య వెల్చేరు నారాయణ రావుగారు సుపరిచితులు. అటు సామాజిక శాస్త్రాలలోనూ, ఇటు మానవీయ శాస్త్రాలలోనూ ఆచార్య వెల్చేరు సాధికారికమైన పరిశోధన చేశారు. ఇంకా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కృష్ణదేవరాయ ప్రొఫెసర్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్స్ అఫ్ ఏషియగా యూనివర్సిటి అఫ్ విస్కాన్సిన్ లొ కొనసాగుతున్నారు. ఆయన ఇండియా వచ్చిన ప్రతిసారీ వివిధ సదస్సులలో, సమావేశాలలొ పాల్గొంటుంటారు. తనను కలిసిన చాలామందితో ఆయన ఆత్మీయంగా మాట్లాడుతూనే అనేక ప్రశ్నలు సంధిస్తారు. పరిష్కారాలూ సూచిస్తారు. అటు సామాజిక శాస్త్రవేత్తలతోనూ, ఇటు మానవీయ పరిశోధక మిత్రులతోనూ ఆయన సమంగా భాషించగలరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆచార్య వేల్చేరు సామాజిక శాస్త్రాల, మానవీయ శాస్త్రాల మధ్య వారధి.
మా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పరిశోధక, అధ్యాపక మిత్రులతో ఆచార్య వెల్చేరు జరిపిన ఇష్ట గోష్ఠిని అభిరుచి ఉన్న మీవంటి నెటిజన్లతొ పంచుకోవాలనుకొంటున్నాను.
ఈసారి; ఆచార్య వెల్చేరు "గ్లోబలైజేషన్ సందర్భాంలొ నువ్వు గ్లోబలైజ్ కాలొదో మరణిస్తున్నట్టే లెక్క" అని తన సంభాషణ మొదలుపెట్టారు. కొద్దిమంది పరిశొధక మిత్రులను అడిగి వారి పరిశొధనాంశాలను తెలుసుకొన్నారు. అలాగే వారి పరిశొధన సమస్యలను గురించి చెప్పమన్నారు. ఈ సందర్భంలోనే తెలుగు పరిశొధన రంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చించారు.
ఒక విమర్శకుడు రాసిన విమర్శపై పరిశొధన చేస్తున్న విద్యార్ధిని ఉద్దేశించి "ఆ విమర్శకుడి విమర్శ మొత్తం నేను చదివాను అనుకొందాం. నీ పరిశొధన గ్రంధం చదవక పోతె నాకు వచ్చే నష్టం ఏమిటి? వాటిలొ చర్చించని అంశాలను నువ్వు ఏమైనా నీ పరిశొధనలొ చర్చిస్తున్నావా?" అని అడిగారు. నిజానికి వివిధ విశ్వవిద్యాలయాలలో పరిశోధనకు పర్యవేక్షకత్వం వహిస్తున్న అధ్యాపకులు కూడా వేసుకోవాల్సిన ప్రశ్న ఇది.
అలాగే; మారుతున్న కాలాన్ని దృష్టిలొ ఉంచుకొని "నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోకపోతే నువ్వు నష్టపోతావ్" అని చెప్పిన నాడే నీకు ఉద్యోగం దొరుకుతుంది అని వెల్చేరు చెసిన్ హెచ్చరికపై యువతరం తప్పనిసరిగా స్పందిస్తుందని ఆశిద్దాం.
ఇలాగే కాలానుగుణంగా వివిధ విశ్వవిద్యాలయాలోని తెలుగు శాఖలలో రావల్సిన మార్పులను ఉపపత్తులతో వివరించారు.
చేరా అన్నట్టు; చాలా కాలం తరువాత ఆచార్య వెల్చేరు మెదడు గిలకొట్టిన అనుభవాన్ని మా అందరిలో కలిగించారు.
ఇందుకు వారికి మనః పూర్వక నమస్సులు.
ఇటువంటి గోష్ఠిని ఏర్పాటుచేసిన మిత్రులు డా. రాములుగారికి అభినందనలు.
Monday, January 8, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment