సుభాషితం
(ఉదాత్త జీవితానుభవానికి, మానసిక పరిపక్వతకు భర్తృహరి రచించిన సుభాషితాలు నిదర్శనంగా నిలుస్తాయి. ఏనుగు లక్ష్మణకవి వీటిని తెలుగులోకి అనువదించారు. భర్తృహరి రచించిన సంస్కృత శ్లోకం, దానికి లక్ష్మణకవి చేసిన తెలుగు అనువాదం ఇక్కడ ఇస్తున్నాం. చదివి భావాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. పద్యాన్ని నోటికి తెచ్చుకొంటె మీరు ఓ మంచి భావాన్ని/అనుభవాన్ని పదిమందికి అందించగుతారు.)
భర్తృహరి సుభాషితం
అజ్ఞ స్సుఖ తరమారాధ్యస్సుఖతర మారాధ్యతే విశేషజ్ఞః
జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రాహ్మాపి నరం న రంజయతి.
లక్ష్మణకవి అనువాదం
తెలియని మనుజుని సుఖముగ
దెలుపందగు సుఖతరముగ దెలుపగవచ్చుం
దెలిసినవానిం దెలిసియు
దెలియని నరుదెల్ప బ్రహ్మ దేవుని వశమే?
తాత్పర్యం
ఏమీ తెలియని వాడికి సుఖంగా బోధించవచ్చు.
జ్ఞానం ఉన్నవాడికి ఇంకా సులభంగా బోధించవచ్చు.
కాని, కొంత తెలిసి కొంత తెలియని (మిడి మిడి జ్ఞానం కలవాడికి) వాడికి ఏ విషయం అయినా
బ్రహ్మ అయినా సరే బోధించలేడు.
No comments:
Post a Comment